Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన RCB బౌలర్ భువనేశ్వర్..! 13 d ago

RCB బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా భువనేశ్వర్ రికార్డు సృష్టించాడు. కాగా, సోమవారం ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ వికెట్ తో భువనేశ్వర్ ఈ ఘనతను సాధించాడు. 35 ఏళ్ల వయసున్న ఈ స్వింగ్ మాస్ట్రో, టోర్నమెంట్ లో 179 మ్యాచుల్లో 184 వికెట్లు పడగొట్టాడు. ఈ వికెట్ తో ఈయన ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలవగా.. యుజ్వేంద్ర చాహల్ (206), పియూష్ చావ్లా (192)లు ముందున్నారు.